...

ఫిట్ గా ఉంటేనే ఏదైనా సాధించగలం: ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి

విశాఖపట్నం/Visakhapatnam: మనం శారీరకంగా, మానసికంగా, ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా సాధించడానికి అవకాశం ఉంటుందని పాడేరు శాసనసభ్యులు శ్రీమతి కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి (Bhagyalalshmi) పేర్కొన్నారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ ఆధ్వర్యంలో సోమవారం ఫిట్ ఇండియా ఫ్రీడం రన్ 3.0 కార్యక్రమాన్ని తలారి సింగ్ నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పాడేరు శాసనసభ్యులు శ్రీమతి కొట్టగుళ్లి భాగ్య‌లక్ష్మి, కలెక్టర్ సుమిత్ కుమార్, సబ్ కలెక్టర్ అభిషేక్ , పీవో గోపాలకృష్ణ తదితరులు ముఖ్య అతిథిలుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా భాగ్యలక్ష్మి మాట్లాడుతూ.. ఎందరో వీరుల త్యాగఫలంతో మనకు సిద్ధించిన స్వతంత్రాన్ని, ఆ వీరుల లక్ష్యాలను సాధించేందుకు యువత అంతా ముందుకు రావాలని ఆమె పిలుపునిచ్చారు. యువత దృఢంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఏదైనా సాధించేందుకు అవకాశం ఉంటుందని ఆమె పేర్కొన్నారు.

Share this Article
Leave a comment
Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.