రేపు పద్మనాభంలో ఉచిత కంటి వైద్య శిభిరం

విశాఖపట్నం: వైఎస్సార్ కంటి వెలుగు పధకం ద్వారా శంకర్ ఫౌండేషన్ కంటి ఆసుపత్రి ఉచిత కంటి వైద్య శిబిరంను జిల్లా అంధత్వ నివారణ సంస్థ మరియు గోస్తనీ విద్యాపీట్ ఆధ్వర్యంలో ఈనెల 7వ తేదీన పద్మనాభంలో ఉన్న గోస్తనీ విద్యాపీట్ హైస్కూల్ లో ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నిర్వహించనున్నారు. ఈ శిభిరంలో అన్ని కంటి వ్యాధులకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించనున్నారు. అవసరమైన వారికి ఉచితంగా ఆపరేషన్ చేసి అవసరమైన మందులు కూడా అందజేయనున్నారు. ఈ వైద్య శిబిరంలో పాల్గొనేవారు తప్పనిసరిగా ఆరోగ్య శ్రీ కార్డు, ఆధార్ కార్డు ఇతర గుర్తింపు కార్డులను తీసుకురావాలని నిర్వాహకులు తెలిపారు.

Share this Article
Leave a comment