Horoscope Today: నేటి రాశి ఫలాలు ( 26-12-2022)

Horoscope Today (నేటి రాశి ఫలితాలు)

మేషం: ఈ రాశి వారు విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక వ్యవహారంలో ధనం చేతికి అందుతుంది. భవిష్యత్ ప్రణాళికలు కొన్ని అమలు చేయగలుగుతారు. సొంతింటి పనుల్లో ముందంజ వేయగలుగుతారు. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. దుర్గారాధన శుభప్రదం

వృషభం: ఈ రాశి వారు మొదలుపెట్టే పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. కీలకమైన పనులను కొన్నాళ్లు వాయిదా వేయడమే మంచిది. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. కొన్ని పరిస్థితులు బాధ కలిగిస్తాయి. చంద్ర ధ్యానం శుభప్రదం.

మిథునం: ఈ రాశి వారు  తలపెట్టిన పనుల్లో విఘ్నాలు పెరగకుండా ముందుచూపుతో వ్యవహరించాలి. ముఖ్య విషయాల్లో అనుకూలమైన నిర్ణయాలు వెలువడతాయి. అధికారుల సహకారం ఉంటుంది. శివ స్తోత్రం పఠించడం మంచిది.

కర్కాటకం: ఈ రాశి వారు మంచి కాలం. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో లాభదాయకమైన ఫలితాలున్నాయి. ఆద్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. బంధు మిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ఈశ్వర సందర్శనం మంచిది.

సింహం: ఈ రాశి వారు మనోబలంతో చేసే పనులు ఫలితాన్నిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. శత్రువులపై మీరే విజయం సాధిస్తారు. కుటుంబంలో చిన్నపాటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. దత్తాత్రేయుడిని ఆరాధించడం మంచిది.

కన్య: ఈ రాశి వారికి మధ్యమ ఫలితాలున్నాయి. మీ మీ రంగాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఒత్తిడి పెరగకుండా చూసుకోవాలి. ముఖ్య విషయాల్లో ముందుగానే స్పందించండి. గణపతి సహస్రనామ పారాయణం మంచినిస్తుంది.

తుల: ఈ రాశి వారికి మధ్యమ ఫలితాలున్నాయి. మీ మీ రంగాల్లో శ్రద్ధగా పనిచేయాలి. అందరినీ కలుపుకుపోవడం వల్ల సమస్యలు తగ్గుతాయి. శ్రమ అధికమవుతుంది. సమాచారలోపం లేకుండా చూసుకోవాలి. ఆవేశాలకు పోకూడదు. గోవిందనామాలు చదివితే మంచి జరుగుతుంది.

వృచ్చికం: ఈ రాశి వారు గొప్ప ఫలితాలను సాధిస్తారు. సుఖ సౌఖ్యాలు కలవు. ఒక వార్త మనోధైర్యాన్ని పెంచుతుంది. సుఖసంతోషాలతో గడుపుతారు. చక్కటి ప్రణాళికలతో వ్యాపారంలో లాభాలను పొందుతారు. శ్రీవేంకటేశ్వరస్వామి ఆరాధన శ్రేయోదాయకం.

ధనుస్సు: ఈ రాశి వారు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాలలో మీకు ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయి. పట్టుదల వదలకండి. కలహ సూచన. అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. దక్షిణామూర్తి స్తోత్రం చదివితే మంచిది.

మకరం: ఈ రాశి వారు మీ మీ రంగాల్లో కీర్తిప్రతిష్ఠలు పెరుగుతాయి. మీ అధికార పరిధి పెరుగుతుంది. సమయానుకూలంగా ముందుకు సాగి అందరి మన్ననలను అందుకుంటారు. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. ఈశ్వరాభిషేకం శుభాన్నిస్తుంది.

కుంభం: ఈ రాశి వారు ముఖ్య కార్యాల్లో ఆలస్యం జరిగే సూచనలు ఉన్నాయి. ఆపదలు కలుగకుండా చూసుకోవాలి. శ్రమకు తగిన గుర్తింపు దక్కడానికి బాగా కష్టపడాల్సి వస్తుంది. విష్ణుసహస్ర నామాలు పారాయణం చేయడం మంచిది.

మీనం: అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ఆర్థికంగా జాగ్రత్తలు అవసరం. నూతన వస్తువులను కొంటారు. మీ అధికార పరిధి పెరుగుతుంది. లక్ష్మీగణపతి ఆరాధనా శుభప్రదం.

Share this Article
Leave a comment