Girl Swallows CellPhone: సోదరుడితో గొడవ.. సెల్‌ఫోన్‌ మింగేసిన యువతి

girl swallows phone

Girl Swallows Phone: మధ్యప్రదేశ్‌లో షాకింగ్‌ ఘటన ఒకటి చోటు చేసుకుంది. సోదరుడితో గొడవ పడిన ఓ 18 ఏండ్ల యువతి సెల్‌ఫోన్‌ను మింగేసింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో భిండ్‌ జిల్లాలో గురువారం చోటు చేసుకుంది. జిల్లాకు చెందిన యువతి సోదరుడితో గొడవపడింది. గొడవ కాస్తా కాసేపటికి తారాస్థాయికి చేరుకుంది. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన యువతి చైనీస్‌ మొబైల్‌ ఫోన్‌ను మింగేసింది (Girl Swallows Phone). అనంతరం తీవ్రమైన కడుపు నొప్పి, వాంతులు చేసుకోవడం మొదలు పెట్టింది. ఊహించని ఈ ఘటనతో ఒక్కసారిగా షాక్‌ అయిన సోదరుడు.. ఈ విషయాన్ని వెంటనే కుటుంబ సభ్యులకు తెలియజేశాడు. దీంతో వారు యువతిని వెంటనే గ్వాలియర్‌ (Gwalior) లోని జయారోగ్య ఆసుపత్రికి తరలించారు.

అక్కడ యువతిని పరీక్షించిన వైద్యులు ఆమె పొట్టలో సెల్‌ఫోన్‌ ఉన్నట్లు గుర్తించారు. దాదాపు రెండు గంటలపాటు శ్రమించి శస్త్రచికిత్స ద్వారా మొబైల్‌ఫోన్‌ను బయటకు తీశారు. ఆపరేషన్‌ అనంతరం యువతికి పది కుట్లు పడ్డాయని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పారు. త్వరలోనే డిశ్చార్జి చేయనున్నట్లు సీనియర్‌ వైద్య నిపుణుడు డాక్టర్‌ కుష్వాహా తెలిపారు.

/Web Stories/

Share this Article
Leave a comment
మరో విషాదం.. సీనియర్‌ నటుడు చంద్రమోహన్‌ కన్నుమూత బేబమ్మ క్రేజ్ తగ్గేదేలే | Latest Photos of Krithi Shetty నేటి రాశి ఫలితాలు | Today Horoscope 07-04-2023 అల్ట్రా స్టైలిష్‌లుక్‌లో మహేష్‌బాబు.. Today Rasi Phalalu 05-04-2023 Shakuntalam Movie Casting Shaakuntalam Movie Review | శాకుంతలం మూవీ రివ్యూ Secunderabad to Tirupati Vande Bharat Express RRR Stroy Book Raashi Sing Beautiful Hot Gallery