బాణాసంచా దుకాణంలో అగ్ని ప్రమాదం.. ఇద్దరు మృతి

విజయవాడలోని జింఖానా మైదానంలో ఏర్పాటు చేసిన బాణసంచా దుకాణంలో అగ్నిప్రమాదం జరిగింది.  దుకాణాలకు వచ్చిన బాణసంచా దించుతుండగా ఈ ప్రమాదం సంభవించింది.

bharat shorts

విజయవాడలోని జింఖానా మైదానంలో ఏర్పాటు చేసిన బాణసంచా దుకాణంలో అగ్నిప్రమాదం జరిగింది.  దుకాణాలకు వచ్చిన బాణసంచా దించుతుండగా ఈ ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మృతులు బాణసంచా దుకాణంలో పనిచేసే బ్రహ్మ, కాశీగా పోలీసులు భావిస్తున్నారు.  అగ్నిప్రమాదంలో 15, 16, 17వ నంబర్‌ దుకాణాలు పూర్తిగా ఆహుతి అయ్యాయి.  18వ నంబర్‌ దుకాణం పాక్షికంగా కాలిపోయింది. నాలుగు ఫైరింజన్లతో అగ్నిమాపక సిబ్బంది మంటలార్పుతున్నారు. పేలుడు శబ్ధాలతో .. స్థానికులు భయంతో పరుగులు తీశారు.  ఏ మాత్రం ఆలస్యమైనా మైదానంలోని 20 షాపులు దగ్ధమయ్యేవని స్థానికులు తెలిపారు. పెట్రోల్ బంక్ పక్కన బాణసంచా దుకాణాలకు ఎలా అనుమతించారని స్థానికుల ప్రశ్నిస్తున్నారు.

ఇక్కడ వీడియో చూడండి:

Share this Article
1 Comment