నరవ జనసైనికుని కుటుంబానికి రూ. 25,000 ఆర్థిక భరోసా

Bharatshorts

విశాఖపట్నం: పెందుర్తి నియోజకవర్గం, 88 వార్డ్, నరవ గ్రామంలో జనసేన (Janasena) పార్టీ కుటుంబ సభ్యుడైన పట్నాల శివ వారం రోజుల క్రితం అనారోగ్యం బారిన పడటం వలన వారి కుటుంబ సభ్యులు ప్రైవేట్ ఆసుపత్రిలో జాయిన్ చేసి సుమారు 1 లక్ష 50 వేల రూపాయలు అప్పుచేసి చికిత్స ఇప్పించడం జరిగిన విషయాన్ని స్థానిక జనసేన పార్టీ నాయకులు దృష్టికి రాగానే జనసేన పార్టీ (Janasena Party) అధ్యక్షులు పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో ఈరోజు వారి కుటుంబాన్ని పరామర్శించి మీకు ఎల్లవేళలా నరవ జనసేన పార్టీ కుటుంబం అండగా ఉంటుంది అని భరోసా ఇవ్వడంతో పాటు 25 వేల రూపాయలు ఆర్థిక భరోసా కూడా ఇవ్వడం జరిగింది. మీకు భవిష్యత్తులో ఎటువంటి అవసరం ఉన్న మీకు మేము అండగా ఉంటాం. మీ సమస్యను మా దృష్టికి తీసుకుని రండి అని ధైర్యం ఇవ్వడం జరిగింది.

ఈ యొక్క ఆర్థిక భరోసా నరవ జనసేన పార్టీ కుటుంబ సభ్యులు అందరి సహకారంతో జరిగిందని, ఈ కార్యక్రమంలో ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలపడం జరిగింది, కార్యక్రమంలో స్థానిక నాయకులు గళ్ళ శ్రీనివాసరావు, వబ్బిన జనార్ధన శ్రీకాంత్, సాలాపు కనకరాజు సాలాపు అప్పారావు గోపిశెట్టి ప్రవీణ్, పట్నాల శివ, బొబ్బర శ్రీను, బొడ్డు నాయుడు, బొండా రవి బాబు, రాడి పెంటారావు, మరియు జనసైనికులు పాల్గొన్నారు.

Share this Article
Leave a comment