కరెంట్ వైర్లు తెగిపడి ఆరుగురు రైతులు సజీవ దహనం

pregnant women dies in tet exam hall

కరెంట్ వైర్లు తెగిపడి ఆరుగురు రైతులు మృతి

ఆంధ్రప్రదేశ్: అనంతపురం జిల్లాలోని బొమ్మనహాల్ మండలం దర్గాహోన్నూరు ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ట్రాక్టర్‌పై విద్యుత్ తీగలు తెగిపడటంతో ఆరుగురు రైతులు (Farmers) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. దర్గాహోన్నూరు గ్రామానికి చెందిన కూలీలు పొలంలో మొక్కజొన్న కంకులు కోతకు వెళుతుండగా విద్యుత్ మెయిన్ వైర్లు ఒక్కసారిగా తెగిపడ్డాయి. దీంతో ఆరుగురు కూలీలు అక్కడికక్కడే సజీవ దహనం అయ్యారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని తీవ్రం గాయపడిన మరో ముగ్గురిని ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

Share this Article
Leave a comment