Visakhapatnam: ప్రేమ విఫలమైందని యువకుడు ఆత్మహత్య

love failure

విశాఖపట్నం: ప్రేమ విఫలమైందనే (love failure) మనస్తాపంతో ఎఓ యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కశింకోట ఎస్సై ఎ.ఆదినారాయణరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం… ఒడిశా రాష్ట్రం కొర్లమాల్‌ గ్రామానికి చెందిన గోవర్థన్‌ బాగ్‌ (21) కశింకోట మోదమాంబ గుడి దగ్గరలో ఉన్న ఇటుక బట్టీలో పని చేస్తున్నాడు. ప్రేమ విఫలమైందనే (love failure) బాధతో శుక్రవారం బట్టీకి సమీపంలోని చెట్టుకు ఉరి వేసుకొన్నాడు. ఇటుకల బట్టీ యజమాని పిచ్చల చంద్రశేఖర్‌రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై వివరించారు.

Share this Article
Leave a comment