వచ్చే నెలలో భోగాపురం గ్రీన్‌ ఫీల్డ్‌ విమానాశ్రయం శంకుస్థాపన

Bharat Shorts

విజయనగరం: వచ్చే నెలలో భోగాపురం గ్రీన్‌ ఫీల్డ్‌ విమానాశ్రయం (Bhogapuram Airport), గిరిజన విశ్వవిద్యాలయానికి ప్రధానమంత్రి చేతుల మీదుగా శంకుస్థాపన చేయబోతున్నామని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. అమరావతి రైతుల పాదయాత్ర ఆగిపోయినట్లుగా భావిస్తున్నానని మంత్రి అన్నారు. ఏది ఏమైనప్పటికీ విశాఖ పరిపాలనా రాజధానిగా ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్ష సాకారం అయినట్టేనని అభిప్రాయపడ్డారు.

విశాఖ కేంద్రంగా పరిపాలనా రాజధానికి కొన్ని అడ్డంకులు ఉన్నాయని.. వాటిని పరిష్కరించుకొని త్వరలోనే విశాఖను పరిపాలనా రాజధానిగా చేస్తామన్నారు. భోగాపురం విమానాశ్రయం (Bhogapuram Airport) భూ సేకరణ, నిర్వాసితుల పునరావాస పనులు, కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం భూసేకరణపై విజయనగరం కలెక్టర్‌ కార్యాలయంలో జిల్లా అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు.

Share this Article
Leave a comment