మార్షల్ ఆర్ట్స్ కే వన్నెతెచ్చిన రెమో యాదవ్ టీమ్

bharat shorts

ఎన్నో ఏళ్లుగా భీమిలి పరిసర ప్రాంతాల్లో పిల్లలకు మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ ఇస్తూ, ఎన్నో పతకాలు పొందుతూ, విద్యార్థులను మానసిక వత్తిడి నుండి దూరం చేస్తూ వారి తల్లిదండ్రులకు ఊరికి మంచిపేరు తెస్తున్న భీమిలి ద్రోణాచార్యుడు రెమో యాదవ్ అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి, కురుపాం నియోజకవర్గం పరిశీలకులు గంటా నూకరాజు అన్నారు.

ఈనెల 16వ తారీకున మధురవాడలో నిర్వహించిన ఏపి ఓపెన్ స్టేట్ కరాటే చాంపియన్ షిప్ -2022 పోటీల్లో రెమో యాదవ్ ఆధ్వర్యంలో శిక్షణ పొందిన విద్యార్థులు పాల్గొన్నారు. ఇంతకుముందు రెమో యాదవ్ దగ్గర శిక్షణ పొంది బ్లాక్ బెల్ట్ గా రూపాంతరం చెందిన పి. రమణ, కె. రాంబాబులు ఈ పోటీల్లో పాల్గొన్న విద్యార్థులకు ప్రాతినిధ్యం వహించారు. వివిధ విభాగాల్లో పతకాలు సాధించారు. అందులో గోల్డ్ – 31, సిల్వర్ – 10, బ్రాంజ్ – 8 ఉన్నాయని కోచ్ రెమో యాదవ్ తెలియజేసారు.

విజేతలతో గంటా నూకరాజు

విజేతలతో గంటా నూకరాజు

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పాల్గొన్న గంటా నూకరాజు చేతులమీదుగా గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేసారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పిల్లల్లో ఆత్మస్టైర్యం వృద్ధి చెంది ఇంకా భవిష్యత్ లో ఉన్నతమైన రంగాల్లో రాణించడానికి ఇలాంటి క్రీడలు దోహదపడతాయని అన్నారు. అంతేకాకుండా బాక్సింగ్, కరాటే వంటి వాటిలో అత్యున్నత ప్రావీణ్యం పొందినవారికి భవిష్యత్ లో అనేక రంగాల్లో స్థిరపడే అవకాశం ఉందని గంటా నూకరాజు అన్నారు.

పిల్లల్లో అత్యధిక ప్రతిభను కనబర్చి అనుకూలమైన సమయాల్లో తనదైన శైలిలో కోచింగ్ ఇస్తున్న నా సోదరులు రెమో యాదవ్ మరియు వారి శిష్య బృందానికి నాయొక్క అభినందనలు అని గంటా నూకరాజు అన్నారు. ఈ కార్యక్రమంలో రెమో లయన్స్ డ్రాగన్ మార్షల్ ఆర్ట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బి. వరహాలరావు, లీగల్ అడ్వయిజర్ సతీష్, బూర శ్రీను, త్రినాద్, అశోక్, అన్నారావు తదితరులు పాల్గొన్నారు.

Share this Article
Leave a comment