ఏపీ ఎంపీపీల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలిగా శెట్టి నీలవేణి

విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ ఎంపీపీల సంక్షేమ సంఘం ఎస్ టి విభాగరాష్ట్ర అధ్యక్షులు ర్యాలీగా అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం ఎంపీపీ శెట్టి నీలవేణిని నియమిస్తూ ఎంపీపీల సంఘం రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు మేకల హనుమంతరావు సోమవారం అమరావతి మండల పరిషత్ కార్యాలయంలో నియామక పత్రాన్ని ఆమెకు అందజేశారు. ఎంపీపీల ఆధ్వర్యంలో జరిగిన ఎన్నికల్లో ఆమెను ఎస్టి విబాగా రాష్ట్ర అధ్యక్షురాలుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా మేకల హనుమంతరావు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. సంక్షేమ సంఘం మరింత బలోపేతం చేసేందుకు కృషి చేయాలని ఎస్టీ విభాగాన్ని విస్తరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆమెకు సూచించారు.

రాష్ట్రంలోని ఎంపీపీల సంక్షేమంపై సమిష్టి కృషితో ముందుకు వెళదామని అన్నారు. ఈ కార్యక్రమంలో అచ్చంపేట ఎంపీపీ శ్రీరజనిబాయ్ వీర నాయక్, అనంతగిరి వైస్సార్సీపీ అధ్యక్షుడు శెట్టి ఆనంద్, సర్పంచ్ లు బిమ్మాలమ్మ, సాలేపు పెంటమ్మ, మండల నాయకులు పాడి కృష్ణ మూర్తి, శ్రీను, రాజ్ కుమార్, షేక్ మదీనా, ఈశ్వరరావు, నాగేశ్వరరావు, కమిడి ప్రసాద్,తిరుపతి, ప్రసాద్ తదితరులు హాజరయ్యారు

Share this Article
Leave a comment