Anantha Padmanabhaswami: అనంత పద్మనాభ స్వామి హంస వాహన నిర్మాణానికి లక్ష విరాళం

విశాఖపట్నం: పద్మనాభం (padmanabham) మండలంలో వేంచేసి ఉన్న శ్రీ అనంత పద్మనాభ స్వామి (anantha padmanabhaswami) వారి హంస వాహనం నిర్మాణానికి విశాఖపట్నంకి చెందిన శివాజీ రాజు దంపతులు లక్ష రూపాయలు విరాళం అందజేశారు. ఎన్నో ఏళ్లుగా నిలిచిపోయిన స్వామివారి హంస వాహనం ఊరేగింపు కార్యక్రమాన్ని ఈ ఏడాది నుంచి పునఃప్రారంభించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా హంస వాహన నిర్మాణానికి తమ వంతుగా శివాజీ రాజు దంపతులు లక్ష రూపాయల విరాళాన్ని పద్మనాభం మండల పరిషత్ అధ్యక్షుడు కంటుబోతు రాంబాబు, పద్మనాభం సర్పంచ్ తాలాడ పాప (పద్దు) ఆధ్వర్యంలో ఆలయ అర్చకులకు అందజేశారు. ఈ సందర్భంగా దాతలపై ఎల్లవేళలా స్వామివారి ఆశీస్సులు ఉండాలని అర్చకులు దీవెనలు అందించారు.

Share this Article
Leave a comment